calender_icon.png 16 September, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శరవేగంతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు

16-09-2025 12:00:00 AM

మంగపేట, సెప్టెంబరు 15 (విజయక్రాంతి): పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశలో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం పుట్టింది అని మంగపేట  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టిపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కృషి పట్టుదలతో మంగపేట మండలంలో మొదటి విడత ఎంపికైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శరవేగంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం దృడ సంకల్పంతో తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఎటువంటి సాంకేతిక సమస్యలు ఏర్పడకుండా చూసుకోవడంలో మండల కాంగ్రెస్ పార్టీ తరుపున ఎల్లప్పుడు ప్రజల సేవలో నేను ఉంటానని మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టిపల్లి వెంకటేశ్వర్లు ప్రజలకు హామీ ఇచ్చారు.