13 August, 2026 | 3:33 PM

బీడీ కార్మికులకు పెన్షన్ వసతి కల్పించండి

13-08-2026 02:15 PM

బోథ్, ఆగస్టు 13(విజయక్రాంతి): వందలాదిమంది బీడీ కార్మికులు 12 సంవత్సరాల కాలంగా పెన్షన్ వసతి కోసం ఎదురు చూస్తున్నారని వారికి పెన్షన్ అందే విధంగా చూడాలని బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి గోవర్ధన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎంపీడీవో ఎల్ రమేష్ కు గురువారం వినతిపత్రం అందించారు. బీడీ కార్మికులకు అంగాల్సిన అనేక రకాల సౌకర్యాలు పథకాలు అందే విధంగా ప్రభుత్వం చూడాలన్నారు. బీడీ కార్మికులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మున్సిఫ్ ఉన్నారు.