28 June, 2026 | 2:03 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం అందించాలి

05-08-2025 12:44 AM

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని 

ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం/కరకగూడెం, ఆగస్టు 4, (విజయ క్రాంతి); కస్తూరిబా పాఠశాలల్లో చరణ విద్యార్థులకు రుచికరమైన భోజనంతో పాటు, నాణ్యతతో కూడిన విద్యను అందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం పినపాక నియోజకవర్గం పరిధి లోనికరకగూడెం కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా కలెక్టర్ పాఠశాల లోని తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, వంటగది, మరుగుదొడ్లను పరిశీలించారు.

తరగతి గదిలో విద్యార్థులతో మమేకమై వారికి అందుతున్న సదు పాయాలు విద్య బోధన ఏమైనా సమస్యలు ఉన్నాయా? మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల్లో బాలికలకు సమగ్ర విద్యను అందించడంలో కస్తూరిబా బాలికల విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన వసతులు, భద్రతా ప్రమాణాలు, ఆరోగ్యకరమైన ఆహారం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రతి విద్యార్థి చదువులో ఉన్నత స్థాయికి చేరేందుకు అవసరమైన పరిసర వాతావరణం పాఠశాలలో ఉండాలి. మౌలిక వసతుల కల్పనలో రాజీ ఉండరాదు స్పష్టం చేశారు.

పరిసరాలు పరిశుభ్రత తప్పకుండా పాటించాలి. వి ద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం అందించాలి అని ఆదేశించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు.పాఠశాలల్లో మురుగునీరు బయటకు వెళ్లేందుకు వీలుగా డ్రైనేజీ ని ర్మించాలని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారని కలెక్టర్ దృష్టికి ఉపాధ్యాయులు తీసుకు వెళ్ళగా డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధి కారులను ఆదేశించారు.

కరకగూడెంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నవోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన తరగతి గదులు, మరుగుదొడ్లు ఇతర మౌలిక సదుపాయాలు పరిశీలించి సం తృప్తి వ్యక్తం చేశారు. ఈ సంవత్సరంలో నవోదయ పాఠశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మండల విద్యాశాఖ అధికారి మంజుల, తాసిల్దార్ ఘంటా ప్రతాప్, డిప్యూటీ తాసిల్దార్ కాంతారావు, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, ఆర్ ఐ కృష్ణ ప్రసాద్ మరియు ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.