05-08-2025 12:45:51 AM
పటాన్ చెరు/జిన్నారం, ఆగస్టు 4 : పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. మేఘాలు కమ్ముకొని పటాన్ చెరు, బీరంగూడలో మొదలైన వర్షం జిన్నారం, గుమ్మడిదల, రామచంద్రాపురంలో కురిసింది. వరి, ఇతర కూరగాయల పంటలకు ఈ వర్షం భారీ మేలు చేసింది.
కాగా బొల్లారం, గడ్డపోతారం, పటాన్ చెరు, పాశమైలారం, ఖాజీపల్లి, బొంతపల్లి పారిశ్రామికవాడల్లోని పలు రసాయన పరిశ్రమలు వర్షం వరద మాటున రసాయన వ్యర్థాలను వదిలాయి. కొన్ని పరిశ్రమల ఔట్ లెట్ల నుంచి రసాయన వ్యర్థాలు బయటకు పారాయి. అవి నేరుగా సమీప చెరువు, కుంట్యల్లోకి చేరాయి. యథేచ్ఛగా రసాయన వ్యర్థాలను వదిలిన పరిశ్రమలపై పీసీబీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలుకోరారు.