09-01-2026 12:00:00 AM
శ్రీ శుభానంద బ్రహ్మణ నిత్యాన్నదానసత్రం ఆధ్వర్యంలో సేవప్రారంభం
కాళేశ్వరం, జనవరి 8 (విజయక్రాంతి): మహాదేవపూర్ మండలం కాళేశ్వరం లోశ్రీ శుభానంద బ్రహ్మణ నిత్యన్నా సత్రము, మాజి ఎంపీటీసీ రెవెల్లి మమత ఆధ్వర్యంలో వృద్ధులు, నిరుపేదలకు నిత్యం భోజనం అందించే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వ్యవస్థాపకులు మాడుగుల చంద్రశేఖర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాజీ ఎంపీటీసీ రెవెల్లి మమతా ఆధ్వర్యంలో కాళేశ్వరం గ్రామాల్లోని పలు వాడల్లో ఉన్న నిరుపేద వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఇంటింటికి భోజనాలు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం కాళేశ్వరం ప్రాంతంలో మానవతా సేవలకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.