19-02-2026 02:20:10 AM
మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్
సికింద్రాబాద్, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో వినియోగదారులకు నాణ్యమైన మాంసాహారం అందించే ఎంఎం పటేల్ పౌల్ట్రీ ట్రేడర్స్ యాజమాన్యానికి తాజా మాజీ కార్పోరేటర్ ముద్దం నర్సింహా యాదవ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఓల్ బోయిన్ పల్లి మల్లిఖార్జున్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎం పటేల్ పౌల్ట్రీ ట్రేడర్స్ చికెన్, మటన్ హోల్ సేల్ షాప్ ప్రాంభోత్సవానికి తాజా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ మాజీ చైర్మన్ నరేందర్ గౌడ్ ముఖ్య అతిధిలుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మహమ్మద్ వహీ ద్ అలీ, కాజా మొయినుద్దీన్, ముజాయిద్ అలీ, సాజిద్, మజీద్ అలీ, ఎస్.కె వాజిద్, ఇమ్రాన్, డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, మహమ్మద్ సయ్యద్ సలీం, కర్రీ జంగయ్య, సిహెచ్. పోచయ్య, నరేందర్ గౌడ్, బుర్రి యాదగిరి, ఇజాజ్ భాయ్,జాంగిర్ భాయ్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు..