21 April, 2026 | 5:11 AM

ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించండి

21-04-2026 02:55 AM

క్రిమిలేయను ఎత్తివేయాలి 

బీసీ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఇవ్వాలి 

కీలకపోస్టుల్లో బీసీ అధికారులను నియమించండి 

బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ 

హైదరబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు సరైన వాటా దక్కాలంటే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధ వద్ద బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర డైరీని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజ రై ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్‌గౌడ్ అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దేశబోయిన రమ వ్యవహరించారు.ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి జాజుల మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు రాజ్యాంగాన్ని సవరించి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించిన విధంగానే బీసీ ఉద్యోగులు కూడా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

60 శాతం ఉన్న బీసీలకు ఉద్యోగ రంగాల్లో 18 శాతం కూడా ప్రాతినిధ్యం లేదన్నారు బీసీ ఉద్యోగుల ప్రాతినిధ్యం జనాభా దామాషా ప్రకారం దక్కాలంటే ప్రమోషనల్లో రిజర్వేషన్లు కల్పిం చాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పోస్టింగులు, బదిలీల్లో, కీలక శాఖ హెచ్వోడీల్లో బీసీ ఉద్యోగులకు ప్రాధాన్యత కల్పించాలని, బీసీ ఉద్యోగులపై ఏసీబీ పేరుతో వేధింపులు ఆపాలని, బీసీ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునివ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీసీ ఉద్యోగం సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏం చంద్రశేఖర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ డీ రమ మాట్లాడుతూ బీసీలపై విధించిన క్రిమిలేరు రద్దు చేయాలని,  బీసీ ఉద్యోగుల సంఘానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న టీఏలను విడుదల చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్,ఉద్యోగ నాయకులు కోటాజి, రాదరాణి, వారాల శ్రీనివాస్, జ్యానేశ్వర్, నళిని, జ్యోతి,వెంకటేశ్వర రావు, రాగవేంద్ర రావు, ఓంకార్,సీతారం, శేషచారి, అనురాద తదితరులు పాల్గొన్నారు.