16 April, 2026 | 8:04 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

గిరిజన, ఆదివాసీలకు మూడు నవోదయ విద్యాలయాలు ఇవ్వండి

04-04-2025 01:08 AM

 మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ 

మహబూబాబాద్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): పార్లమెంట్ జరిగిన జీరో అవర్‌లో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారు మహబూబాబాద్ పార్లమెంట్ సమస్యలపై మాట్లాడారు..తన నియోజకవర్గం లో గిరిజన, ఆదివాసీలతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎక్కువగా ఉంటారని, వారు విధ్యకి చాలాదూరంలో ఉంటారని  ఆవేదన చెందారు.

వారు అభివృద్ధి చెందాలంటే చదువుకోవడం అవసరం అన్నారు. అందుకు అనుగుణంగా మూడు కొత్త  నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసి గిరిజన,ఆదివాసీ,ఏజెన్సీ ప్రజలను చదువుకు దగ్గర చేసి వారు ఉన్నత శిఖరాలకు  చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని  బలరాం నాయక్  కోరారు.