20-01-2026 12:00:00 AM
కొత్తపల్లి, జనవరి 19(విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా వారి ఆద్వర్యములో సోమవారం రోజున 20 మంది టీబి పేషెంట్స్ కి న్యూట్రియన్ ఫుడ్ బాస్కెట్,ఆరు రకముల ఫుడ్ ఐటమ్స్ మరియు 30 ఎగ్స్ ను 20 మంది పేషెంట్స్ కి ఇవ్వడము జరిగింది. ఈ కార్యక్రమములొ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పెండ్యాల కేశవ రెడ్డి,వైస్ చైర్మన్ చిదుర సురేష్,సెక్రటరీ ఊట్కూరి రాధ కృష్ణా రెడ్డి,ట్రెజరర్ పొరెడ్డి శ్రీహరి రెడ్డి,జిల్లా ఎగ్జిక్యూట్ కమిటీ మెంబర్స్ ఇంజనీర్ కోల అన్నా రెడ్డి,ఎలగందుల మున్నిందర్,దోమకొండ కృష్ణ మూర్తి మరియు టీ బి హాస్పిటల్ డాక్టర్ అండ్ ఇంచార్జ్ అశోక్ మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.