calender_icon.png 21 January, 2026 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల భద్రతే లక్ష్యం

20-01-2026 12:00:00 AM

  1. డిసెంబర్‌లో 98 ఫిర్యాదులు

13 మందిని పట్టుకున్న షీ టీమ్స్ 

వేధింపులకు పాల్పడితే జైలుకే: డీసీపీ లావణ్య

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 19 (విజయక్రాంతి): నగరంలో మహిళలు, యువతుల భద్రతే ముఖ్యమని, భంగం కలిగించే ఆకతాయిల పట్ల హైదరాబాద్ షీ టీమ్స్ కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఉమె న్ సేఫ్టీ వింగ్ డీసీపీ డాక్టర్ లావణ్య ఎన్జేపీ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ‘డిసెంబర్ నెలలో వాట్సాప్, సోషల్ మీడి యా, ప్రత్యక్ష పిటిషన్ల ద్వారా మొత్తం 98 ఫిర్యాదులు షీ టీమ్స్‌కు అందాయి. 29 పిటిషన్లను సంబంధిత పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. ఇందులో 14 ఎఫ్‌ఐఆర్లు నమోదు కాగా, 15 కేసులు తదుపరి చర్యల నిమిత్తం పెండింగ్‌లో ఉన్నాయి.

క్షేత్రస్థాయిలో నిఘా, డెకాయ్ ఆపరేషన్ల ద్వారా 13 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో 11 మం ది మేజర్లు కాగా, ఇద్దరు మైనర్లు ఉన్నారు. వీరిలో తీవ్రమైన అసభ్య ప్రవర్తనకు పాల్పడిన వారిపై పెట్టీ కేసులు నమోదు చేయగా.. కోర్టు విచారణ అనంతరం ముగ్గురికి 7 రోజుల జైలు, ఒకరికి 4 రోజులు, మరొకరికి 2 రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది’ అని చెప్పారు. అందులో రాపి డో రైడర్ ఉన్నట్టు తెలిపారు.

అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం పేరుతో ఓ యువతి నుం చి డబ్బులు వాడుకోవడమే కాకుండా, ఆమె ప్రైవేట్ ఫోటోలతో బెదిరింపులకు దిగిన యలమంచిలి సాయి త్రినాథ్ (28) అనే వ్యక్తికి కూడా న్యాయస్థానం 7 రోజుల జైలు శిక్ష విధించినట్టు తెలిపారు. కాగా నేరాల నియంత్రణలో భాగంగా గత నెలలో స్కూ ళ్లు, కాలేజీలు, బహిరంగ ప్రదేశాల్లో 188 అవగాహన సదస్సులు నిర్వహించామని, రద్దీ ప్రాంతాల్లో 1045 అబ్జర్వేషన్ డ్రైవ్స్ చేపట్టామని డీసీపీ తెలిపారు. ఆన్లైన్ మో సాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.