calender_icon.png 20 January, 2026 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

54 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

20-01-2026 12:00:00 AM

  1. హైదరాబాద్ సీసీఎస్,సైబర్ విభాగాల్లో మార్పులు
  2. అర్ధరాత్రి సీపీ సజ్జనార్ ఉత్తర్వులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 19 (విజయక్రాంతి): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ ప్రక్షాళన జరిగింది. సీపీ సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి 54 మం ది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీసీఎస్, సైబర్ క్రైమ్ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ వంటి హై-ప్రొఫైల్ పోలీస్ స్టేషన్లకు కొత్త ఎస్హెచ్‌ఓలను నియమించగా..

సైబర్ క్రైమ్, సీసీఎస్ విభాగాల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికా రులను బదిలీ చేసి కమిషనర్ ఆఫీసుకు అటాచ్ చేయడం చర్చనీయాంశంగా మారిం ది. తాజా ఉత్తర్వుల ప్రకారం వెయిటింగ్ లిస్టులో ఉన్న పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు. ట్రాఫిక్ విభాగంలోనూ భారీ మార్పులు జరిగాయి. 32 మందిని సీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు.