ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన
14-03-2026 02:43 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డులో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నట్టు నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి తెలిపారు. శనివారం పట్టణంలోని సిద్దాపూర్ రాంనగర్ ఆదర్శనగర్ కాలనీలో సందర్శించారు. కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నాయన వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ స్థానిక నాయకులు ఉన్నారు




