1 September, 2026 | 7:48 PM

2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింప చేయాలి

01-09-2026 | 06:46pm

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): హైదరాబాదులోని ఇందిరా పార్క్(Indira Park)లో జరుగుతున్న పిఆర్టియు మహా ధర్నా కార్యక్రమానికి(PRTU Mahadharna program) నాగిరెడ్డిపేట్ మండలం(Nagireddypet Mandal) పిఆర్టియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు(Teachers) తరలి వెళ్లారు. సిపిఎస్ అంతం పాత పెన్షన్ సాధన, పిఆర్సి వెంటనే అమలు చేయాలి. 2003 ఉపాధ్యాయులకి పాత పెన్షన్ వర్తింప చేయాలి.

ఈ సమస్యల సాధన కోసం సెప్టెంబర్ 1 సిపిఎస్ విద్రోహ దినమైన(CPS Rebellion Day) రోజుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఇందిరా పార్క్కు ఉపాధ్యాయుల లోకం తరలివెళ్లి సమస్యల సాధనే పిఆర్టియు పంతం నాగిరెడ్డిపేట పిఆర్టి ఉపాధ్యాయులు తరలి వెళ్లారు.ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట్ మండల పిఆర్టియు అధ్యక్షులు ప్రసాద్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.