1 September, 2026 | 7:48 PM

రైల్వే పెన్షనర్ నర్సమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం

01-09-2026 | 06:42pm

కేసముద్రం,(విజయక్రాంతి): దివంగతురాలైన రైల్వే పెన్షనర్ అనుమాస నరసమ్మ కుటుంబానికి, రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్(Railway Pensioners Association) సభ్యులు 12 వేల రూపాయలను అందజేశారు. నరసమ్మ సోమవారం రాత్రి కేసముద్రం పట్టణంలో కన్నుమూశారు. మంగళవారం రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నరసమ్మ భౌతికకాయంపై(Physical body) పుష్పగుచ్చ ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.