టీచర్ల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ కృషి
నిర్మల్, మార్చి ౧ (విజయక్రాంతి): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ కృషి చేస్తుందని పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం మాట్లాడుతూ తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక,ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసే విధంగాఉందని ఈ విషయంలో ఉపాధ్యాయులు ఎలాంటి ఆందోళన చెందకూడదు అని, తాను ఎల్లవేళలా ఉపాధ్యాయుల వెంట ఉండి ఉపాధ్యాయుల సమస్యలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుండి విద్యావ్యవస్థలో నెలకొన్న అనేక సమస్యలను తన ద్వారా తెలుసుకొని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్న క్రమంలో విద్యా కమిషన్ ఈరకంగా రిపోర్టు ఇచ్చి ఉపాధ్యాయులను అయోమయ పరిస్థితికి గురిచేయడం సరైంది కాదని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఓం ప్రకాష్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు చక్రాల హరి ప్రసాద్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మసీయుద్దీన్, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నగేష్, సాయి కృష్ణ, రాందాస్, వేణుగోపాల్, ముత్యం, బాలకృష్ణ, వెంకటరమణ, రవికుమార్ పాల్గొన్నారు.




