9 April, 2026 | 8:57 AM

నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ

12-01-2026 02:30 AM

శ్రీహరి కోట నుంచి రాకెట్‌ను ప్రయోగించనున్న ఇస్రో

ఈ ఉపగ్రహం ఎన్‌ఎస్‌ఐఎల్ తొమ్మిదోది

నెల్లూరు, జనవరి 11(విజయక్రాంతి): శ్రీహరి కోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నేటి (సోమవారం) ఉదయం 10.17 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రాకెట్ ప్రయోగానికి ఆదివారం(24 గంటల ముందే) ఉదయం 10.17 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) తయారు చేసిన తొమ్మిదో వాణిజ్య ఉపగ్రహం ఇది. ఈ రాకెట్ ద్వారా ఈఓఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. దేశ రక్షణ రంగానికి ఇది అత్యంత కీలకం కానుంది. 2026లో ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగమిది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వది. ఈ మిషన్ ద్వారా 8 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు.