12-01-2026 03:07:06 AM
కిలోమీటరు పొడవునా శౌర్యయాత్ర
ఆలయ శిఖరంపై నేటికీ త్రివర్ణ జెండా రెపరెపలు
భారత్ శక్తికి నిదర్శనం
ఆలయాన్ని రక్షించిన అసంఖ్యాక యోధులకు ప్రధాని నివాళి
గాంధీనగర్, జనవరి 11 : భారతీ య సంస్కృతిలో శౌర్యానికి, పరాక్రమానికి సోమ్‌నాథ్ క్షేత్రం ఒక గొప్ప నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. మొఘల్ చక్రవర్తి గజనీ మహ్మద్ ఆలయంపై దాడిచేసి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం గుజరాత్‌లోని ప్రభాస పటన్‌లోని సోమ్‌నాథ్ ఆలయం వద్ద నిర్వహించిన శౌర్యయాత్రలో ఆయన మాట్లాడారు. గతంలో విదేశీ దురాక్రమణదారులు ఈ క్షేత్రంపై దాడులు చేసి విధ్వంసం సృష్టించినప్పటికీ, భారతీయ విశ్వాసాన్ని వారు ఏమా త్రం చెరిపివేయలేకపోయారని గుర్తుచేశారు.
గజనీ మహ్మద్ నుంచి ఔరం గజేబు వరకు అనేకమంది విదేశీయు లు కత్తితో సోమ్‌నాథ్‌ను గెలవగలమని భావించారని, కాలక్రమంలో ఆ దురాక్రమణదారులు చరిత్రపుటలకే పరిమితమయ్యారని విమర్శించారు. నేటికీ త్రివర్ణ పతాకంతో రెపరెపలాడుతున్న ఆలయ శిఖరం.. భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతోందని కొనియాడారు. వెయ్యేళ్ల కిందట మన పూర్వీకులు తమ విశ్వా సం కోసం ప్రాణాలకు తెగించి పోరాడారని, వారి పోరాట పటిమ వల్లే ఈ పుణ్యక్షేత్రం నేడు సమున్నతంగా నిలిచిందని భావోద్వేగానికి గురయ్యారు. ఆధునిక సాంకేతికత ప్రాచీన సంప్రదాయాల కలయికతో భారత్ ప్రపంచ యవనికపై తనదైన ముద్ర వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఆలయ చరిత్ర నిర్వీర్యానికి గత ప్రభుత్వాలు యత్నం
సోమనాథ్ ఆలయ చరిత్రను తుడిచిపెట్టేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయ ని ప్రధాని మోదీ అన్నారు. బానిస మనస్తత్వంతో దాని ప్రాముఖ్యతను విస్మరించారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శలు చేశా రు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ చేసిన ఆలయ పునర్నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకున్నారని విమర్శించారు. భా రత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేశార ని ధ్వజమెత్తారు. సోమ్‌నాథ్‌పై విదేశీ దురాక్రమణదారులు అనేక దండయాత్రలు చేశా రని ప్రధాని అన్నారు. ఈ ఆలయం.. ధైర్యం, త్యాగాలు, దృఢసంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆలయంపై త్రివర్ణపతాకం జెండా ఎ గురుతూనే ఉందని, అది భారత దేశ స్ఫూర్తి ని ప్రపంచానికి చాటుతోందని వెల్లడించా రు. సోమ్‌నాథ్ స్వాభిమాన్ పర్వ్.. భారతదేశ విశ్వాసానికి ప్రతిబింబమని పేర్కొన్నారు.
1951 మే 11న మళ్లీ దర్శనభాగ్యం
పుణ్యక్షేత్రంపై గజనీ మహ్మద్ క్రూర, హింసాత్మక దండయాత్ర చేసింది 1026 జనవరిలోనేనని ప్రధాని పేర్కొన్నారు. ఆలయంపై దాడికి వెయ్యేళ్లయిన సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవల ప్రత్యేక వ్యాసం రాసిన సంగతి తెలిసిందే. ఆలయ పునరుద్ధరణ తర్వాత 1951 మే 11న ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ సమక్షంలో ఆలయంలో భక్తులకు మళ్లీ దర్శనభాగ్యం కలిగిందని చెప్పారు. దాడి జరిగిన ప్రతిసారీ ఆలయాన్ని కాపాడుకునేందుకు ప్రజలు దృఢంగా అడ్డుపడ్డారని, కొందరు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేసుకున్నారు.
మోదీ కాన్వాయ్ వెంట 108 అశ్వాలు
సుమారు కిలోమీటరు పొడవునా సాగిన శౌర్యయాత్రలో 108 అశ్వాల ఎస్కార్ట్ మధ్య ప్రధాని ప్రజలకు అభివాదం చేశారు. సోమ్‌నాథ్ శౌర్యయాత్రలో ప్రధాని మోదీ కాన్వాయ్ వెంట108 అశ్వాలు పాల్గొన్నాయి. ఈ యాత్రకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు.. మోదీ, మోదీ అని నినాదాలు చేస్తూ ప్రధానికి ఘనస్వాగతం పలికారు. ఇక ఇక్కడ 108 అశ్వాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వాటిని ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఆలయం వైపు వెళ్తున్న ప్రధానికి అవి ఎస్కార్ట్‌గా మారినట్లు ఆ సన్నివేశం తలపించింది. అనంతరం మోదీ సోమ్‌నాథ్ ఆలయానికి చేరుకొని, పూజలు నిర్వహించారు.
ఆకట్టుకున్న 3,000 డ్రోన్ల ప్రదర్శన
సోమ్‌నాథ్ ఆలయ ఆవరణలో 3000 డ్రోన్ల ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నది. ప్రధాని ఈ పర్య టనలో కేవలం రాజకీయ, ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెప్పారు. సోమ్‌నాథ్ ఆ లయ ఆవరణలో జరిగిన 3000 డ్రోన్ల ప్రదర్శనను ఆయన వీక్షించారు. ఈ ప్రదర్శనలో భగవంతుడైన శివుడి ఆకృతులు, శివలింగం ప్రతిబింబాలు ప్రజల ను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుమా రు 72 గంటల పాటు నిరంతరాయం గా సాగిన ఓంకార మంత్ర జపంలో ప్ర ధాని స్వయంగా పాల్గొని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మోదీ, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో పటేల్ చేసిన కృషిని స్మరించుకున్నారు.