calender_icon.png 17 September, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

17-09-2025 06:32:05 PM

చిట్యాల (విజయక్రాంతి): ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఉరుమడ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ప్రభుత్వ బాలుర బీసీ వసతి గృహంలో, గ్రామ పంచాయతీ వద్ద, జిల్లా పరిషత్ హై స్కూల్, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమమం నిర్వహించగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేడుకలలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి ,సీనియర్ నాయకుడు పల్లపు బుద్ధుడు, సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, పాకాల దినేష్, కురుపటి లింగయ్య, బొడ్డు శ్రీను, ఉయ్యాల నరేష్, మేడబోయున శ్రీను, బోయ స్వామి, బోయ లక్ష్మ య్య, మందుగుల కుమార్, పల్లపు రామకృష్ణ, మర్రి యాదయ్య, ఉయ్యాల మల్లేష్, బొడ్డు యాదయ్య, మర్రి శంకర్, హాస్టల్ వార్టెన్ , పంచాయితీ కార్యదర్శి, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయుని ఉపాద్యాయులు పాల్గొన్నారు.