17-09-2025 06:32:47 PM
ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను హౌసింగ్ ఏఈ అంకుష వలీ ముగ్గు పోసి ప్రారంభించారు. గ్రామంలో 33 ఇండ్లు మంజూరు అయ్యాయని, ఎంపీడీవో సురేష్ ఆదేశాల మేరకు పది ఇండ్లకు ముగ్గులు పోసి నిర్మాణం పనులను ప్రారంభించామన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మించుకుంటే బిల్లులు మంజూరు అవుతాయని ఏఈ అంకుషవలి తెలిపారు.