calender_icon.png 17 September, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం

17-09-2025 06:30:43 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణ శాఖ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు భూపతి రెడ్డి గారు , మాజీ మున్సిపల్ చైర్మన్ కంచిటి గంగాధర్ లు హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తెలంగాణకు స్వతంత్రం రాలేదని అన్నారు.  అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు స్వస్తి పలకాలని హుకుం జారీ చేసి తెలంగాణకు స్వతంత్రం తేవడం జరిగిందని అన్నారు.  సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణలో ప్రతి ఒక్కరు జరుపుకోవాలని కోరడం జరిగింది. తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం ఆరోజే వచ్చిందని చెప్పడం జరిగింది. విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.