ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా పాలన
బోయినపల్లి: ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలని బోయినపల్లి ప్రత్యేక అధికారి ఎంపీడీవో జయశీల అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ లో సర్పంచ్ నల్లమోహన్ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముక్య అతిథిగా ఏ ఏం సి చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ హాజరయ్యారు.ముందుగా తెలంగాణ గీతాన్ని ఆలపించి సమావేశంలో ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు. అనంతరం గ్రామంలో జరిగిన వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పేర్లు, నిధుల గురించి సర్పంచ్ నల్లమోహన్ ప్రజలకు వివరించి చెప్పారు.ప్రజాపాలన కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఏ ఏం సి చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర ఏళ్ల కాలం లో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,చొప్పదండి ఏం ఎల్ ఏ మేడిపల్లి పల్లి సత్యం సహకారం తో మండలం లో జిల్లాల్లోనే ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని తెలిపారు.అలాగే గృహ జ్యోతి పథకం,ఉచిత బస్సు,ఇందిరమ్మ ఇళ్లు,రైతు భరోసా,రుణ మాఫీ,సన్న బియ్యం తో పాటు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది ఆ ఈ తెలిపారు.అనంతరం వివిధ శాఖల అధికారులు గ్రామంలో చేపట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రజనీ దేవి రోడ్డు ప్రమాదాలపై వివరించి చెప్పి, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు,ఈ సందర్భంగా ఎంపీడీవో జయశీల మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరిట ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తుందని అన్నారు.
99 రోజుల స్పెషల్ ప్రోగ్రాం క్రింద పారిశుధ్య నిర్వహణ, పెండింగ్ ఫైల్స్ పరిష్కారం, వైద్యశాఖ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు, రోడ్డు భద్రత పై అవగాహన, వ్యవసాయం , మహిళా సంక్షేమం వంటి వివిధ రంగాలపై ప్రత్యేక కార్యక్రమాలు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సంఖ్య పెంచే విధంగా గ్రామస్తులు చూడాలన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను కార్పోరేట్ స్థాయిలో తయారుచేసి విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు, షూలు, స్టేషనరీ తదితర వస్తువులు అందించడం జరుగుతుందన్నారు. అనుభవాగ్లైన ఉపాధ్యాయులతో విద్య బోధించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో తమ తమ పిల్లను చదివించేందుకు కృషి చేయాలన్నారు. వచ్చే జూన్ లో నూతనంగా అమలు కాబోతున్న పతకాల ను వివరించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీలో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రజనీ దేవి, ఉపసర్పంచ్ మెరుపుల చందన జలంధర్, కార్యదర్శి అనిల్, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.




