2 April, 2026 | 5:23 PM

వైద్యుల పై దాడి చేయడం సరికాదు

02-04-2026 04:05 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే వైద్యులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వైద్య ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. దాడి జరిగిన సంతోష్ రాజ్ ఆసుపత్రిని సందర్శించి ఇటువంటి దాడి జరగకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నేరెళ్ల రమేష్ మాట్లాడుతూ సంవత్సరాలుగా రాత్రిపగళ్ళు ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యుడిపై దాడిచేయడం సిగ్గుచేటు అని అన్నారు వైద్యులపై దాడిచేసిన వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా శిక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి తలకొక్కుల నరహరి కోశాధికారి చక్రి కార్యదర్శి రాకేష్ రమేష్ విజయ్ ప్రశాంత్ తదితరులు పాల్గున్నారు