05-02-2026 12:33:10 AM
మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 4: కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన గాడి తప్పిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకు లకు అధికారం అనేది ఇవ్వాళ ఉంటుంది, రేపు పోతుంది కానీ ప్రజలకు మేలు చేయాలనేదే నాయకునికి ఉండాల్సిన లక్షణమన్నారు.
ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్‌లో బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పాలనపై చార్జిషీట్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్, పెద్దపెల్లి ఎంపీ కాంటెస్ట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, తులా ఆంజనేయులు, ముఖేష్ గౌడ్ పాల్గొన్నారు.