18 July, 2026 | 12:27 AM

వైద్య సేవలతో ప్రజల్లో విశ్వాసం పెంచాలి

18-07-2026 12:27 AM

చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి

హనుమకొండ, జూలై 17(విజయ క్రాం తి):ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెం పొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోచమ్మకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజువారీగా వచ్చే రోగు ల సంఖ్య, అందిస్తున్న వైద్య సేవలు, రోగుల నమోదు ప్రక్రియ, ప్రాథమిక పరీక్షలు, కంప్యూటరైజ్డ్ రికార్డులను వైద్యాధికారి డా. ఎన్. దీప్తిని అడిగి తెలుసుకున్నారు.

రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం క్షయ (టీబీ) వ్యాధిగ్రస్తుల వివరాలు, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మందుల పంపిణీ, నెలవారీ పర్యవేక్షణ, వాటి డిజిటల్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. టీబీ రోగులకు నిరంతర వైద్య సేవలు అందించి, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న మందుల నిల్వలను పరిశీలించి, అవసరమైన అన్ని ఔషధాలు ఎ ల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా టీబీ బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.