25 April, 2026 | 5:03 PM

గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు: ఏఐవైఎఫ్

25-04-2026 03:32 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందులో లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉమ్మగాని హరీష్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ... బుక్ చేసిన గ్యాస్ ఇతరులకు మళ్లించి డెలివరీ అయినట్టు సందేశాలు వస్తున్నాయని, మూడు నెలలుగా సిలిండర్ అందక ప్రజలు ఏజెన్సీ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. కేవైసీ, ఫోన్ నంబర్ మార్పు వంటి సాకులతో ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మార్వో తనిఖీలు చేసి అక్రమాలను అరికట్టి బుక్ చేసిన వారికి అంతరాయం లేకుండా గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.