20 March, 2026 | 9:45 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ప్రజారోగ్యం ప్రభుత్వాల బాధ్యత

18-03-2026 12:00 AM

దేశంలోని ప్రజలందరూ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పేద, ధ నిక అనే తేడా లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు మెరుగైన ఉచిత వైద్యాన్ని అందించాలని కోరుకుంటున్నారు. ప్రపంచంలోని ముఖ్యమైన దేశాలన్నీ ప్రజారోగ్యం కోసం తమ జీడీపీలో 5 శాతం నుంచి 12.5 శాతం వరకు ప్రజారోగ్య సంరక్షణకే నిధులు కేటాయిస్తున్నాయి. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎ దిగింది. అయినప్పటికీ, 2025 నాటికి కేంద్ర బడ్జెట్లో ప్రజారోగ్యానికి కేటాయించే నిధులు జీడీపీలో 1.5 శాతమైనా దాటలేదు. జాతీ య వైద్య విధానం ప్రకారం..

రాష్ట్రాలు తమ బడ్జెట్లో ప్రజారోగ్యానికి విధిగా 8 శాతానికి పైగా నిధులు కేటాయించాలి. కానీ, తెలంగాణలో ఈ నిధులు ఏనాడూ 4.5 శాతానికి మించలేదు. కేటాయించిన నిధులలో కూడా కేవలం 65 శాతం మాత్రమే ఖర్చవడం గమనార్హం. ఈ కారణంతో ప్రభుత్వ ఆసుపత్రు ల్లో సరిపోను వైద్య సిబ్బంది ఉండటం లేదు. సరైన వైద్య పరికరాలు, మెడిసిన్ లేక వైద్యం అందడం లేదు. తప్పని పరిస్థితుల్లో సామాన్యులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తూ అప్పుల పాలు అవుతున్నారు.

వైద్య సిబ్బంది కొరత.. కొన్ని- వాస్తవాలు

ప్రపంచ ఆరోగ్య శాఖ ప్రమాణాల ప్రకా రం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక వై ద్యుడు ఉండాలి. కానీ, భారత్‌లో ఐదు వేల మందికి ఒక వైద్యుడు ఉన్నారని ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ ఇటీవల అంచనా వేసింది. దేశంలో ప్రతి 81 మందికి ఒక వైద్యుడు ఉన్నారని గతంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారు. బహుశా ఆయన అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని విభాగాల్లోని వైద్యు ల సంఖ్యను కలిపి చెప్పి ఉండవచ్చు. భారత్‌లో అలోపతి డాక్టర్ల సంఖ్య 13.86 లక్షలు ఉండగా, ఆయుర్వేద, ఇతర విభాగాల వైద్యు ల సంఖ్య 5.65 లక్షలుగా ఉంది.

గతంలో డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ప్ర భుత్వ ఆసుపత్రిలో పనిచేయడానికి ఎవరూ ముందుకు వచ్చే వారు కాదు. ఇప్పుడు, మెడికల్ కాలేజీలు పెరగడం వల్ల తెలంగాణ ఏర్పాటయ్యాక కొత్తగా 32,000 మంది డాక్టర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నేడు తెలంగాణలో ప్రతి వెయ్యి మందికి 681 మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయడానికి డాక్టర్లు ఉత్సాహంగా ఉన్నా ప్రభుత్వం వారిని నియమిం చడం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 12,000 మంది డాక్టర్లు, నర్సుల కొరత ఉన్నట్లు ఒక నివేదిక చెబుతోంది.

ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యానికి వ్యత్యాసాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి ఏటా ఒక పడకకు 8 లక్షలు మాత్రమే ఖర్చవుతున్నది. అదే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒక పడకకు ఏటా 50 లక్షల నుంచి 3 కోట్ల వరకు ఖర్చవుతున్నది. ప్రభుత్వాలు తగినన్ని నిధులు ఇవ్వక ఆసుపత్రి సేవలు అందించలేకపోతున్నాయి. నేడు తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కలిపి 3000 ఉండగా, ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య 43,186గా ఉన్నది. ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ప్రధానంగా పట్టణాలు, నగరాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి.

వైద్యులు, వారి స హాయకులు 80 శాతం మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆసుప త్రుల్లోని ఓపీలో అన్ని మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నా, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ఓపీ రోగులకు వైద్యులు ఆరు రకాల మెడిసిన్ రాస్తే, వాటిలో సగం మెడిసిన్ మాత్రమే దొరుకుతున్నది. కొందరికి పది రోజులకు మెడిసిన్ రాస్తే, సిబ్బంది ఐదు రోజులకే మెడిసిన్ ఇచ్చి పంపిస్తున్నారు.

మెడిసిన్ పంపిణీలో కమిషన్ల దందా

ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపోను మందు లు లేకపోవడంతో డాక్టర్లు ప్రైవేటు మెడికల్ షాపులతో కుమ్మక్కవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరకని మందుల వివరాలు వారికి తెలియజేసి వాటిని తెప్పిస్తున్నారు. ప్రైవేట్ మెడికల్ షాపులో లభించే మందులనే వైద్యులు రోగులకు రాస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా మెడికల్ షాపుల నుంచి డాక్టర్లకు 20 శాతం కమిషన్ అందుతున్నది.

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలోని ప్రైవే ట్ మెడికల్ షాపుల్లో రోజుకు 10 లక్షలు, ఉస్మానియాలో 12 లక్షల వ్యాపారం జరుగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కలిపి, రాష్ట్రంలో సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల మంది ఉన్నారు. వీరు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటే బిల్లులకు ప్రభుత్వం రియంబర్స్‌మెంట్ చేస్తుంది. రూ.50 వేల లోపు బిల్లులైతే జిల్లా స్థాయిలోనే ఈ ప్రక్రియ పూర్తివుతుంది.

రూ.2 లక్ష ల లోపు బిల్లు అయితే డీఎంఈ కార్యాల యం స్క్రూటినీ చేసి ప్రభుత్వానికి పంపిస్తుంది. ఆర్థిక శాఖ లేదా పే అండ్ అకౌంట్స్ ద్వారా ఈ బిల్లులకు రియంబర్స్‌మెంట్ జరుగుతుంది. రూ.2 లక్షలకు పైబడిన బిల్లులైతే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పరి శీలించి ఎంత ఇవ్వాలో నిర్ణయిస్తుంది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి నెలకు సగటున 5,500 బిల్లులు డీఎంఈ కార్యాలయానికి వస్తాయి.

వీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చే యాలంటే రోజుకు 200 బిల్లులు స్క్రూటినీ చేయాలి. కానీ, అక్కడ ఒక బిల్లు పూర్తి కావడానికి ఐదు నుంచి ఆరు నెలలు పడుతోం దని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ సిబ్బంది కొరత కారణంగానే ఈ ఆలస్యం జరుగుతున్నది.

నకిలీ మెడిసిన్ ముప్పు

రాష్ట్రంలో నకిలీ మెడిసిన్ దందా పెద్ద ఎత్తున జరుగుతున్నది. జ్వరం, దగ్గు నుంచి క్యాన్సర్ మెడిసిన్ వరకు ఏవి అసలో.. ఏవి నకిలీవో తెలియని పరిస్థితి నెలకొంది. కాలం చెల్లిన మెడిసిన్లు సైతం విపణిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల నుంచి నకిలీ మందులు దిగుమతి అవుతున్నాయి. కొంతమంది కేటు గాళ్లు ఇక్కడే కంపెనీలు పెట్టి నకిలీ మందు లు తయారు చేస్తున్నారు.

ఆర్‌ఎంపీ డాక్టర్లు, ఆన్లైన్ ప్లాట్‌ఫాం ద్వారా ఈ నకిలీ మందు లు రోగులకు చేరుతున్నాయి. నకిలీ మెడిసిన్‌ను బ్రాండెడ్ లోగోలతో ప్యాక్ చేసి అక్ర మార్కులు అసలు మందులాగే నమ్మిస్తున్నారు. ల్యాబ్ పరీక్షలు జరిగితే తప్ప నకిలీదని గుర్తించడం సాధ్యం కాదు. సన్ ఫా ర్మా, గ్లెన్ మార్క్, అరిస్టో వంటి బ్రాండెడ్ కం పెనీల లోగోలతో నకిలీ మందులు తయారవుతున్నాయి. బీపీ, షుగర్ మందుల ను సు ద్ద, చాక్‌పీసు, మొక్కజొన్న పిండితో తయా రు చేస్తున్నారు. క్యాన్సర్, గుండె జబ్బు మందులను కూడా ఇలాగే అమ్ముతున్నారు. 

మెడికల్ షాపుల నిర్వహణలో లోపాలు

డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ప్రకా రం.. ప్రతి మెడికల్ షాప్లో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉండాలి. బిఫార్మసీ లేదా డిఫార్మసీ పూర్తి చేసిన వారు మాత్రమే దుకాణాలను నిర్వహించాలి. కానీ, మెజారిటీ దుకాణాల్లో ఫార్మసిస్టులు ఉండటం లేదు. ఇంగ్లిషు అక్షరాలను చదవగలిగిన వ్యక్తులను నియమిం చుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. అధికారులు అనుమతి ఇచ్చే ముందే ఫార్మసిస్టుల ఉనికిని పరిశీలించాలి.

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై రాసిచ్చిన మందులను మాత్రమే ఇవ్వాలి. కానీ ప్రస్తుతం ఏ మెడికల్ షాప్ నిర్వాహకుడు ఈ నిబంధనను పాటించడం లేదు. అడిగిన మందులన్నీ ఇచ్చేస్తున్నారు. రోగి వయస్సు, శరీరతత్వం ఆధారంగా వైద్యులు డోస్ నిర్ణయిస్తారు. రోగి అడిగిన మందులు ఇస్తే అవి దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది. వివిధ నర్సింగ్ హోంలు ఎలాంటి అనుమతులు లేకుండానే మెడికల్ షాపులు నిర్వహిస్తున్నాయి. గ్రామాల్లో ఆర్‌ఎంపీలు ఇళ్లలోనే మందుల దుకాణాలు నడుపుతున్నారు. గరిష్ఠ ధరల కంటే 30 నుంచి 40 శాతం అధిక ధరలకు మందులు అమ్ముతున్నారు.

ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ప్రజారోగ్య సంరక్షణపై సమగ్ర చర్యలు తీసుకోవాలి. నకిలీ మెడిసిన్ విక్రయాలు, అధిక ధరలకు విక్రయాలపై ఉక్కుపాదం మోపాలి. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలి. ఇతర ముఖ్యమైన దేశాలు ప్రజల వైద్యానికి వెచ్చిస్తున్నట్లు మన దేశంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లోల నిధులు కేటాయించాలి.

 వ్యాసకర్త: మాజీ ఎమ్మెల్సీసెల్: 99630 27577