20 March, 2026 | 8:17 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ట్రంప్ విధ్వంసకాండ

19-03-2026 12:00 AM

పశ్చిమాసియాలో యుద్ధం రగులుతూనే ఉంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై, తిరిగి ఇరాన్ ఆ రెండు దేశాల తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులు మొదలు పెట్టి 18 రోజులు దాటింది. యుద్ధం వల్ల అగ్రరాజ్యం సాధించింది ఏమీ లేకపోగా, ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతున్నది. మొదట ఇరాన్‌లో అధికార మార్పిడి జరిగితే చాలని ప్రకటించిన డోనాల్డ్ ట్రంప్, ఇప్పుడు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత అక్క డ అధికార మార్పిడి జరిగింది. ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించారు.

అయినా, ట్రంప్ వైఖరిలో మార్పు లేదు. శాంతి చర్చలకు మొగ్గు చూపకుండా యుద్ధాన్ని ఉధృతం చేయడాన్ని చూస్తుంటే, ఆయన ఒక నియం తలా మారుతున్నారనేది స్పష్టమవుతున్నది. ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, అణు కేంద్రాలను ధ్వంసం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న అగ్రరాజ్యం, ఆ దేశ సామాన్యుల ప్రాణాలను సైతం బలిగొంది. ఇప్పుడు ఇజ్రాయెల్‌తో జతకట్టి అమెరికా ఏం బావుకున్నది..? అన్న ప్రశ్న ఇప్పుడు సొంత దేశంలోనే వినిపిస్తోంది. ఇరాన్ నుంచి అమెరికాకు ఇప్పటికిప్పుడు ఎలాంటి తక్షణ ముప్పు లేదు.

అయినప్పటికీ, కేవలం ఇజ్రాయెల్ ఒత్తిళ్ల మేరకే ట్రంప్ ఈ యుద్ధాన్ని నెత్తికి ఎత్తుకున్నారు. గతంలో ఇరాక్ యుద్ధంలో అమెరికా ఇలాగే తలదూర్చి వేలాది మంది సైనికులను, బిలియన్ల కొద్దీ సంపదను కోల్పోయింది. ట్రంప్ మళ్లీ ఇప్పుడు అదే తప్పు ను పునరావృతం చేస్తున్నారు. ట్రంప్ ధోరణిని నిరసిస్తూ తాజాగా ఆ దేశ జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (ఎన్సీటీసీ) డైరెక్టర్ జో కెంట్ తన పదవికి రాజీనామా చేశారు.

యుద్ధం పట్ల తన మనస్సాక్షి అంగీకరించడం లేదని ఆయన తన రాజీనామా లేఖలో కుండబద్దలు కొట్టారు. ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ అనే విధానాన్ని పక్కన పెట్టి, ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం యుద్ధం చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు. ఇరాన్ నుం చి అమెరికాకు ముప్పు ఉందనేది ఒక అబద్ధపు ప్రచారమని, ట్రంప్ తప్పుదారి పట్టి, నియంతలా మారారని పేర్కొన్నారు.

యుద్ధ రంగం లో ఎంతో అనుభవం ఉన్న జోకెంట్ వంటి అధికారి అభ్యంతరాలను పక్కన పెట్టి, ఆయన్ను ‘బలహీనుడు’ అని ట్రంప్ విమర్శించడం ఆయన అహంకారానికి నిదర్శనం. ఏదేమైనా, ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా అంతర్జాతీ యంగా ఏకాకి అవుతున్నదనేది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో తమ వంతు సాయం చేయాలని ట్రంప్ కోరినప్పటికీ నాటో దేశాలు, యూరోపియన్ యూనియన్ నుంచి మద్దతు కరువైంది. ఫ్రాన్స్, కెనడా వంటి మిత్ర దేశాలు సైతం యుద్ధంలో తాము భాగస్వాములు కాలేమని తేల్చి చెప్పాయి.

మిత్ర దేశాల మాట వినకుండా, తన సొంత అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ట్రంప్ ముందుకు వెళ్తున్న తీరు నియంతృత్వ పోకడలేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. యుద్ధం కారణంగా ఇరాన్ సైనిక పరంగా కొంత నష్టపోయినప్పటికీ, ఆ దేశం తన ఉనికి కోసం ప్రతిఘటిస్తున్నదనేది వాస్తవం. మొత్తంగా యుద్ధంలో విజేత ఎవరనేది పక్కన పెడితే, అమెరికా మాత్రం తన నైతికతను కోల్పోయిందనేది..

ఇప్పుడు తెరపైకి వచ్చిన అంశం. ట్రంప్ లక్ష్యం శాంతి కాదని, కేవలం విధ్వంసమేనని.. ఆయన తాజాగా నిర్ణయాలను ఒక్కసారి పరికిస్తే, మనకు అర్థమయ్యే విషయం. ఇలాంటి నియం తృత్వ పోకడలు అమెరికా ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు దిగజారుస్తున్నాయి.