ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తా
07-12-2024 09:01 PM
ఎమ్మెల్యే కూనంనేని...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఈ నెల తొమ్మిది నుంచి జరగాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తావిస్తానని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. రూ.2 లక్షల లోపు రైతు రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతానని, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పథకం ప్రస్తావిస్తానని, అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలపై ప్రస్తావిస్తానని తెలిపారు. ఇతర ప్రధాన అంశాలను వాయిదా తీర్మానం ప్రవేశపెట్టు ప్రశ్నించనున్నట్లు తెలిపారు.




