6 April, 2026 | 1:41 PM

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ ల తీరు భేష్...

07-12-2024 10:28 PM

ప్రజా పాలన విజయోత్సవల్లో జిల్లా కలెక్టర్ రాజరి షా...

ఏడాది కాలంలో పోలీసుల విజయాలను వివరించిన ఎస్పీ గౌష్ ఆలం..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల తీరు భేష్ అని జిల్లా కలెక్టర్ రాజరి షా అన్నారు. రాష్ట్రంలో ప్రజల పాలన ప్రారంభమై ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా  రాష్ట్ర ప్రభుతం చేపట్టిన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధర్యంలో పోలీసు హెడ్ కార్టర్స్ లో శనివారం వేడుకలను ఘనంగా నిరహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గౌష్ అలం, రెండవ బెటాలియన్ కమాండెంట్ నితికా పంత్, జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. మొదటగా రాష్ట్ర గీతాన్ని అతిథులు, ప్రజలు విద్యార్థులు ఆలపించిన అనంతరం పోలీస్ డిపార్ట్మెంట్ లో వినియోగించే 100 డైల్, బ్లూ కోర్ట్ వాహనాలతో, నూతనంగా పోలీసు వ్యవస్థకు వచ్చిన వాహనాలు, అత్యవసర సమయాలలో వినియోగించే వజ్ర, ముఖ్య అతిథి ప్రయాణించే బుల్లెట్ రెసిస్టెన్స్ వాహనాలను ప్రదరించారు. ఈ సందర్భంగా డాగ్ స్కాడ్ బృందం విధులు, మాదక ద్రవ్యాలను గుర్తించడం, మందు పదార్థాలను గుర్తించడం లాంటి ప్రదర్షనలు ఇచ్చారు. వివిధ పోలీస్ ల స్టాళ్లను ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం పార్లమెంటు ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలతో జరగకుండా పూర్తి చేయడం జరిగిందని, ప్రభుతం పోలీసు శాఖ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ  రాష్ట్ర ప్రభుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  హోంగార్డులకు రోజుకు ఒక వెయ్యి రూపాయల జీతాన్ని ప్రకటించడం హర్షనీయమని తెలియజేశారు. శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ప్రశాంత వాతావరణంలో ప్రజలకు భద్రత, రక్షణ చర్యలను చేపడుతున్నట్లు తెలియజేశారు. మారుమూల ఆదివాసి గిరిజనులకు వైద్య సదుపాయాలు అందించాలని మెగా మెడికల్ క్యాంపులో ఏర్పాటు చేస్తూ వైద్య సేవలను మరింత దగ్గర చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడి భోజారెడ్డి, ఉట్నూర్, ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ లు, అదనపు ఎస్పీ, డీఎస్పీలు  తదితరులు పాల్గొన్నారు.