అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
07-12-2024 08:54 PM
ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శనివారం కేస్లాపూర్ గ్రామంలో మంజూరైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన భూమి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటీసి బ్రహ్మయ్య, మాజీ ఎంపీపీలు నర్సింగ్ రావు, శంకర్ నాయకులు ధనుంజయ్, దామోదర్ గౌడ్, పురుషోత్తం, చంద్రకుమార్, లింగమూర్తి, శ్రీనివాస్, ధర్మయ్య, మల్లేష్, సతీష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.




