ఈజీఎస్ పేరు మార్పు సాకుతో బీజేపీ కుట్ర
గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ శ్రేణుల నిరసన
ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ఆదిలాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : గ్రామంలోని పేదలకు, కూలీలకు పని కల్పించే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ను నీరుగార్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అంతకుముందు డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాల ఫలితంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేందుకు బీజేపీ ప్రభు త్వం కుట్ర చేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతల నుంచి కేంద్రం పక్కకు జరగాలని చూస్తోందని పేర్కొన్నారు.
పేదలకు, గ్రామీణ ప్రాంత కూలీలకు ఎంతో భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నీరు గార్చాలని బీజేపీ చూస్తుందని, నల్లధనం తీసుకొ చ్చి దేశంలోని ప్రతి వ్యక్తి అకౌంట్లో రూ.15 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పిన మోడీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా దేశ సంపదను అంబానీ, అదానికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షులు సాజీద్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీ వ్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బో రంచు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు గుడిపెల్లి నగేష్, అంబకంటి అశోక్, రూపేష్ రెడ్డి, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.






