17 April, 2026 | 3:09 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

17-02-2026 12:26 AM

అధికారులకు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన ఆదేశం

సికింద్రాబాద్, ఫిబ్రవరి ౧6 (విజయక్రాం తి): ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరే ట్ సమావేశ మందిరంలో  ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఈ. వెంక టాచారితో కలసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలనుస్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా ఆర్జీలపై అధికారులు శాఖల వారీగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని  అధికారులను  ఆదేశించారు.

వాట్సా ప్ ద్వారా అందిన దరఖాస్తులను కూడా అదే ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. పెండింగ్ అర్జీలపై  శాఖల వారిగా  సమీక్షించి అట్టి  అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని  ఆదేశిం చారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 238 ఆర్జీలు అందాయని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిడి హౌసింగ్ అశోక్ చక్రవర్తి,  రెవెన్యూ డివిజనల్ అధికారి రామకృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ జ్యోతి,  జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఆశ న్న, కోటాజి, ప్రవీణ్ కుమార్ ,ఇలియస్ అహ్మద్, జి.ఎం.పరిశ్రమల శాఖ పవన్ కుమా ర్, జిల్లా అధికారులు, ఆర్జీదారులు, తదితరులు పాల్గొన్నారు.