11 July, 2026 | 8:09 PM

Breaking News

మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   బాన్సువాడ జామ మసీద్ నూతన అధ్యక్షునికి ఘన సన్మానం   •   బెజ్జంకిలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు   •   ఎస్‌ఐఆర్–2026ను పారదర్శకంగా నిర్వహించాలి   •   ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించటం గర్వకారణం   •   రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో నోట్‌ బుక్స్ పంపిణీ   •   బిఆర్ఎస్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు   •   సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి   •  

సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి

11-07-2026 07:09 PM

బడంగ్ పేట్,(విజయక్రాంతి): అర్హులైన ఏ ఒక్కరు తమ ఓటు కోల్పోకూడదని, అందుకు ప్రతి ఒక్కరి ఎస్ఐఆర్ ఫాం ను తప్పకుండా నింపి ఇవ్వాలని ఈఆర్ఓ ఎన్.జగదీశ్వర్ రెడ్డి కోరారు. శనివారం బడంగ్ పేట్ సర్కిల్ కార్యాలయంలో డీసీ, ఏఈఆర్ఓ వి.సమ్మయ్య, డిటియు నరేష్  తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటరు జాబితాను సంపూర్ణంగా, ఖచ్చితంగా రూపొందించే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

అర్హులైన ఏ ఒకరు తమ ఓటు కోల్పోకూడదని, అందుకు ప్రతి ఒక్కరు బిఎల్ఓలు ఇచ్చిన ఫాంను నింపి ఇవ్వాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బడంగ్‌పేట్ ఏఈఆర్ఓ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని పూరించడంలో ఏవైనా సందేహాలు ఉన్నా, లేదా 2002 నాటి ఓటరు జాబితాకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాల్సి వచ్చిన ఆయా హెల్ప్‌డెస్క్‌లలో అధికారులు, వాలంటీర్లు అవసరమైన సహాయాన్ని అందిస్తారని చెప్పారు.

అర్హులైన ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా పూరించి, సంబంధిత పోలింగ్ బూత్ స్థాయి అధికారి బిఎల్ఓకి జూలై 24లోగా తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. గడువులోగా ఫారం సమర్పించని పక్షంలో, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వారి ఓటరు నమోదుపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఎస్ఐఆర్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఓటరు నమోదు చేసుకునే ప్రక్రియలో వివిధ పార్టీల ప్రతినిధులు, సోషల్ సర్వీస్ ప్రతినిధులు, ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యి, తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.