6 May, 2026 | 10:20 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

30-09-2025 12:35 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 29 ( విజయకాంత్ ): ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను  సత్వరమే పరిష్కరించాలని  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్   సమావేశ  మందిరంలో  జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 31 అర్జీలను, జిల్లా కలెక్టర్,జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థలు కలెక్టర్ భాస్కరరావు  తో కలసి  అర్జీలను స్వీకరించారు. 

అందులో రెవిన్యూ శాఖ 25, జిల్లాపంచాయతీ  మున్సిపాలిటీ , సర్వే ల్యాండ్,  హోసింగ్, వైద్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి    శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,హౌసింగ్ పి.డి విజయసింగ్ వివిధ శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు.