16 April, 2026 | 1:48 AM

పున్నాగ

03-11-2025 12:56 AM

జ్ఞాపకాలను పున్నాగ పూలుగా 

రాలుస్తున్నది ఈ శరదృతువు

రెండు పూలను అందుకుని

బాల్యపు పరిమళాన్ని ఒంటికి పూసుకున్నాను

వాన కురిసిన రోజూ

ఈ పూలజల్లు ఆగదు !

అవి భువికి దిగివస్తున్న తెల్ల పావురాల్లా ఉన్నాయి !

పైకి తలెత్తి చూస్తే 

చూపులనిండా పున్నాగ పూలే!

అవి తెల్లటి నక్షత్రాల్లా

మెరుస్తున్నాయి !

మన విన్నపాలను

దైవానికి చేరవేసే 

కల్పవృక్షంలా కనిపిస్తోంది పున్నాగ చెట్టు!