13 March, 2026 | 4:15 PM

ప్రజాపాలనలో చిక్కుముడులెన్నో!

02-11-2025 12:00 AM

డాక్టర్ తిరునహరి శేషు :

డిసెంబర్ 7 నాటికి తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికా ర పగ్గాలు చేపట్టి రెండు వసంతాలు పూర్తిచేసుకుని మూడో వసంతంలోకి అడుగు పెట్టబోతున్నది. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి రెండు శాస నసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ర్టం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశం ఇవ్వలేదు కానీ దశాబ్దపు బీఆర్‌ఎస్ పాలనపై వ్యతిరేకతతో, కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల హామీతో ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’ అనే ఆలోచనతో 2023లో మూడవసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు హస్తం పార్టీకి పట్టం కట్టారు.

ఒక దశాబ్దం తర్వాత తెలంగాణ రాష్ర్టంలో పాలన పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రారంభంలో తన ఇన్నింగ్స్‌ను బలంగానే ప్రారంభించింది. కానీ ఈ రెండు సంవత్సరాల ప్రజా పాలన ప్రయాణంలో బలహీనతలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతూ ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి మొదలైనట్లుగా కనపడుతున్నది.

ప్రభుత్వ పాలన విధానంపై, హామీల అమలుపై ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేల అసంతృప్తి రాగా లు, మంత్రి మండలిలోనే సభ్యుల మధ్య సయోధ్య కొరవడటం, రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసి తప్పు చేశామని అఖి ల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడారనే వార్తలు బయట కి పొక్కడం కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి అనే భావన క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతుంది. ఈ రెండు సంవ త్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విజయాల కంటే వైఫల్యాలే పెద్దవిగా కనపడుతుండటంతో ప్రభుత్వంపై ప్రజల నుంచి అసం తృప్తి వ్యక్తమవుతుందనే చర్చ జరుగుతుంది. 

పెరగని ఆదాయం 

గత పాలకులు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ర్టంగా ప్రకటించారు. తలసరి ఆదాయంలో తెలంగా ణ రాష్ర్టం.. దేశంలో మూడో స్థానంలో, దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉండటం విశేషం. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తరువాత రాష్ర్ట ఆదాయం (జీఎస్‌డీపీ) 5 లక్ష ల కోట్ల రూపాయల నుంచి 16 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ప్రతి నెల రాష్ర్ట ప్రభుత్వ ఖజానాకి వచ్చే ఆదాయం 13 వేల కోట్ల రూపాయల నుంచి 18 వేల కోట్ల రూపాయలకు పెరిగింది.

కానీ గత రెండు సంవత్సరాలుగా రాష్ర్ట ప్రభుత్వ ఆదాయం పెరగకపోవటం వల్ల ప్రతినెలా సగటున 5 వేల కోట్ల రూపాయలు అప్పు లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాల్లోనే ప్రభుత్వం వివి ధ రూపాల్లో దాదాపు 2 లక్షల కోట్ల రూ పాయల అప్పులు చేసింది. ప్రభుత్వ నిర్వహణ, అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు, ప్రభుత్వానికి ప్రతి నెలా దాదా పు 25 వేల కోట్ల రూపాయల ఆదాయం అవసరం.

కానీ ప్రభుత్వానికి ప్రతినెలా వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుంది. కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చిన తర్వాత పన్ను ఆదా యం, పన్నేతర ఆదాయం పెంచుకోలేకపోవటం, కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు రాబట్టలేకపోవడంతో ఆర్థిక వైఫ ల్యం స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ర్ట ఆదా య వనరులు పెరగకపోవటం వలన ఉద్యోగులకు ఐదు డీఏల బాకీతో పాటు ఆర్థిక వనరులతో ముడిపడి ఉన్న కీలక సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నారనే విమర్శ ప్రభుత్వంపై వస్తున్నది.

ఒకవైపు ఆదాయం పెరగకపోగా మరోవైపు వ్యయం తగ్గించే చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ప్రణాళిక సంఘం మా జీ ఉపాధ్యక్షులు మాంటెక్  సింగ్ అహ్లువాలియాలు వృధా వ్యయాన్ని తగ్గించాల ని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఎక్కడా వారి సలహాలను పట్టించుకున్న దాఖలాలు కనపడటం లేదు. కాబట్టి ప్రభుత్వ వ్యయనియంత్రణ చర్య లు చేపట్టకుండా పెద్ద ఎత్తున అప్పులు చేయడంతో రాష్ర్టంలో తలసరి అప్పు రెండు లక్షల రూపాయలకు పైగానే పెరిగిపోయింది.

అమలు కాని హామీలు 

కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ రాష్ర్టంలోనూ అధికారంలోకి రావడానికి ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలే ప్రధాన పాత్ర పోషించాయి. తెలంగాణ రాష్ర్టంలో శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీలు, ఐదు డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చారు. కానీ బీసీ, ఎస్సీ, మహిళ, యూత్ డిక్లరేషన్ల హామీలు నెరవేరలేదు. అలాగే కీలకమైన ఆరు గ్యారంటీలు, 13 హామీల్లో ప్రధానమైన పెన్షన్ల పెంపు, మహిళలకు ప్రతినెలా 2500 రూపాయల ఆర్థిక సహాయం, రాజీవ్ యువ వికాసం లాంటి గ్యారెంటీ లు అమలు చేయలేదు.

అమలు చేశామని చెబుతున్న ఇందిరమ్మ ఇళ్లు హామీ మేరకు ఇప్పటికే 9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. కానీ రాష్ర్టవ్యాప్తంగా 9 వేల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు 56 వేల కోట్ల రూపాయలు కేటాయించినా ఆ నిధులను పూర్తి గా ఖర్చు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గ్యారెంటీ కింద రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేలు ఇచ్చే గ్యారెంటీ కింద ఐదు లక్షల లబ్ధిదారులను ఎంపిక చేసినా, ఇప్పటివరకు 80 వేల మంది లబ్ధిదారులకు మాత్రమే సహాయం చేశారు.

అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో, దళితబంధు విషయంలో కూడా ఆయా వర్గాలు అసంతృప్తిగానే ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా యువత నుంచి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. 2లక్షల ఉద్యోగాల సంగతేమో కానీ కనీసం గత ప్రభుత్వం ప్రకటించిన 80వేల  ఉద్యోగాల ఖాళీలను కూడా  ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో భర్తీ చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొనవచ్చు. కాబట్టి హామీలను, గ్యారంటీలను, డిక్లరేషన్లను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజల మన్ననలు పొందలేకపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

సహకరించని అధికారులు

మంత్రుల మధ్య సఖ్యత లేని అంశంతో పాటు ఆయా సందర్భాల్లో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, వారు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నా యి. పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ వ్యవహారం.. కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల వివాదం ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తే, మం త్రి కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ చేసిన ఆరోపణలు, మద్యం టెండర్ల విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్వచ్ఛంద పదవీ విరమ ణ చేయడం,

యూరియా కొరత విషయం లో వ్యవసాయ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్య లు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయనే చెప్పాలి. చాలా మంది మంత్రులకు వారి శాఖలపై ఏ కోశానా పట్టు ఉన్నట్లు అనిపించడం లేదు. అందువల్ల ఆయా శాఖల్లో ఉన్న కీలకమైన అధికారులతో సమన్వ యం లేకపోవడం, అధికారులు కూడా ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించకపోవడంతో పాలనా వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. ‘నేను అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా అధికారులు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని’ స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

అధికారులు సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపకపోవడం, తెలంగాణ ప్రజల పట్ల ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు అనుచితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మం త్రులు, అధికారుల మధ్య కొరవడిన సమన్వయంతో ప్రభుత్వంపై ప్రజల కు నమ్మ కం సడలుతున్న ఛాయలు కనపడుతున్నా యి.

పాలనా వైఫల్యాలు సరిచేసుకోకుం డా, పార్టీ ప్రభుత్వం మరింత సమన్వయం తో పని చేయకుండా, హామీలను, గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయ కపోతే ప్రభుత్వ వైఫల్యం పార్టీ ఓటమికి దారి తీయవచ్చనే అభిప్రాయాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. రాష్ర్ట అభివృద్ధి కి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. 

 వ్యాసకర్త సెల్: 9885465877