calender_icon.png 20 January, 2026 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడపలో ప్యూర్ ఈవీ ప్రారంభం

20-01-2026 01:59:46 AM

కడప, జనవరి 19: భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారులలో ఒకటైన ప్యూర్ సంస్థ కడపలో తన సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది. దక్షిణ భారతదేశంలో తన ఉనికిని బలోపేతం చేసుకునే ప్యూర్ మిషన్‌లో ఈ వ్యూహాత్మక విస్తరణ ఒక ముఖ్యమైన ముందడుగుగా పేర్కొంది. వైఎస్ఆర్ జిల్లా విజయదుర్గ ఆఫీసర్స్ కాలనీలో ప్యూర్ ఈవీకి చెందిన సమగ్రమైన ఎలక్ట్రిక్ టూ-వీలర్ల శ్రేణిని ప్రదర్శించనున్నారు. దీనిలో అత్యంత ఆదరణ పొందిన ఈ ప్లూటో 7G మాక్స్, ఈట్రిస్ట్ ఎక్స్ వంటి మోడళ్లు ఉన్నాయి. కడప ప్రజలకు అసమానమైన ఎలక్ట్రిక్ రైడింగ్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్యూర్ ఈవీ తెలిపింది. 

భారతదేశం అంతటా తమ అమ్మకాలు గణనీయంగా పెంచడం , ఎలక్ట్రిక్ మొబిలిటీని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నటిటప వెల్లడించింది.  స్వదేశీ ఆర్ అండ్ డిపై దృష్టి సారించి, వినియోగదారులకు సుస్థిరమైన ఎంపికలు చేసుకునేలా ప్యూర్ ఈవీ ప్రణాళికలతో ఉందని తెలిపింది. రాబోయే 30 నెలల్లో 250 కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించి, తన జాతీయ నెట్‌వర్క్‌ను 320కి పైగా అవుట్‌లెట్‌లకు విస్తరించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు కంపెనీ పేర్కొంది.