11 August, 2026 | 1:07 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

రథయాత్రను జయప్రదం చేయండి

27-06-2025 05:54 PM

ఇస్కాన్ ఆలయ ప్రతినిధి రంగా తీర్థ దాస్

సిద్దిపేట: ఒరిస్సా రాష్ట్రంలో మాత్రమే జరిగే పూరి జగన్నాథ రథయాత్రను సిద్దిపేటలో నిర్వహించనున్నట్లు ఆలయ ప్రతినిధి రంగతీర్థదాస్ పేర్కొన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒరిస్సా రాష్ట్రంలో మాత్రమే జరిగే జగన్నాథ రథయాత్రను హరే కృష్ణ సత్సంగం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా సిద్దిపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 29వ తేదీన సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయం పక్కన ఉన్న శ్రీనివాస ధ్యాన మందిరం నుండి మధ్యాహ్నం మూడు గంటలకు రథయాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ రథయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.