రైతులను ఇబ్బంది పెట్టొద్దు
రంగారెడ్డి జేసీ భూపాల్‌రెడ్డి ఆదేశం
ఇబ్రహీంపట్నం, మే 21 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు రంగారెడ్డి జిల్లా జేసీ ఎంవీ భూపాల్‌రెడ్డి సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం, రాయపోల్ ధాన్యం కేంద్రాలను మంగళవారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడారు. వారు చెప్పిన విషయాలు ఆలకించారు. అనంతరం రైతులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, వారిని ఇబ్బంది పెట్టొద్దని అధికారులను ఆదేశించారు. జేసీ వెంట డీసీఎమ్‌ఎస్ నుండి సివిల్‌సప్లు జిల్లా మేనేజర్ విజయలక్ష్మీ, జిల్లా కోపరేటీవ్ ఆఫీసర్ దాత్రిదేవి, డిఎస్‌ఓ మేనేజర్ రాథోడ్, ఎమ్‌ఏఓ వరప్రసాద్ రెడ్డి, ఏఈఓ శ్రవణ్‌కుమార్, రఘు, డీసీఎమ్‌ఎస్ మేనేజర్ రాజు, దండుమైలారం కొనుగోలు కేంద్రం ఇంచార్జీ బల్‌శెట్టి అశోక్‌గౌడ్, రైతులు పాల్గొన్నారు.






