05-12-2025 11:36:21 AM
రాష్ట్రపతి భవన్ వద్ద పుతిన్ కు ఘనస్వాగతం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ వద్ద రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కు ఘన స్వాగతం లభించింది. రాష్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పుతిన్ కు స్వాగతం పలికారు. రష్యా అధ్యక్షుడు సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఇరు దేశాల ఉన్నతాధికారులతో పుతిన్, ద్రౌపతి ముర్ము కరచాలనం చేశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలో అడుగుపెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్, రాష్ట్రపతి భవన్‌లో లాంఛనప్రాయ స్వాగతంతో తన పర్యటన 2వ రోజును ప్రారంభించారు. తరువాత రాజ్‌ఘాట్‌లో పుష్పగుచ్ఛం ఉంచుతారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటలకు, అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అధ్యక్షుడికి విందును ఆతిథ్యం ఇస్తారు.