05-12-2025 01:06:29 PM
న్యూఢిల్లీ: దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(Dandakaranya Special Zonal Committee) మీడియా ప్రతినిధి వికల్ప్ లేఖ కలకలం రేపుతోంది. నవంబర్ 27 నాటి వికల్ప్ లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం ఓ కలప వ్యాపారి ద్వారా హిడ్మా(Madvi Hidma) విజయవాడకు వెళ్లారని వికల్ప్ తెలిపారు. నిరాయుధడైన హిడ్మా సహా ఆరుగురిని పోలీసులు హత్య చేశారని తెలిపారు. ఎన్ కౌంటర్ లో హిడ్మా చనిపోయారని కట్టుకథ ప్రచారం చేశారని వికల్ప్ వివరించారు. హిడ్మా హత్యకు కలప వ్యాపారి, బిల్డర్, ఐటీడీఏ కాంట్రాక్టరే కారణమని వికల్ప్ ఆరోపించారు. హిడ్మా, శంకర్ ఎన్ కౌంటర్లపై విచారణ జరిపించాలని వికల్ప్ డిమాండ్ చేశారు. మనీశ్ కుంజాం, సోని చేసిన తప్పుడు ఆరోపణలను వికల్ప్ ఖండించారు.
అరెస్టైన వారిలో కామ్రేడ్ దేవ్ జీ(Comrade Dev Ji), మల్లా రాజిరెడ్డి లేరని స్పష్టం చేశారు. పోలీసులతో దేవ్ జీ, రాజిరెడ్డి ఎలాంటి ఒప్పందం కురుర్చుకోలేదని తెలిపారు. హిడ్మా ఎన్ కౌంటర్ కు దేవ్ జీ కారణమని మాజీ ఎమ్మెల్యే మనీశ్ కుంజా(Former MLA Manish Kunjam) ఆరోపించడం కుట్రే అన్నారు. విజయవాడలో అరెస్టైన కామ్రేడ్లకు న్యాయసహాయం అందించాలని వికల్ప్ కోరారు. ప్రజాపక్ష న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. హిడ్మా సహా 13 మందిని పట్టుకుని హత్య చేశారు. హత్యలను కప్పిపుచ్చుకునేందుకే మారేడుమిల్లి రంపచోడవరం ఎన్ కౌంటర్లు అంటూ కట్టుకథ అల్లారని తెలిపారు. హిడ్మా హత్య ఏపీ పోలీసులు ఆపరేషన్ కాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్ అన్నారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని వికల్ప్ లేఖలో పేర్కొన్నారు.