05-12-2025 12:55:56 AM
మృతుల్లో దక్షిణ బస్తర్ టాప్ కమాండర్
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
భారీస్థాయిలో ఆయుధ, పేలుడు సామగ్రి స్వాధీనం
చర్ల, డిసెంబర్4: ఛతీస్‌గఢ్‌లోని బీజాపూర్ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగింది. బుధవారం జరిగిన ఎన్ కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు, ము గ్గురు డీఆర్‌జీ(డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) జవాన్లు మృతిచెందారు. గురువారం నాటికి మృతుల సంఖ్య పెరిగింది. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని పోలీసు అధికారులు అంచనా వేస్తు న్నారు.
బీజాపూర్ డీఐజీ కమలోచన్ కశ్యప్, ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్‌తో కలిసి బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఎన్‌కౌంటర్ వివరాలను గురువారం వెల్లడించారు. ఎన్‌కౌం టర్ మృతుల్లో మావోయిస్టు ఓ అగ్రనేత ఉన్నట్లు సమాచారం. మొత్తంగా బుధ, గురువారాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 20 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలి నుంచి నక్సలైట్ల మృతదేహాలతో పాటు భారీ స్థాయిలో ఆయుధ, పేలుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
అయితే మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 20 మంది మావో యిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 9 మంది మహిళలవి అని పేర్కొన్నారు. మృతదేహాల లభ్యం.. కూంబిం గ్ కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
అలాగే మృతుల్లో పీఎల్‌జీఓ2 కమాండర్ వెల్ల మోడియం, కంపెనీ నంబర్ 2, 7లకు చెందిన కీలక మా వోయిస్టులు రైను ఓఎం, సన్ను, అవలం, నందా మీడియం, లాలు, రాజు పూణెం, రమేష్ కవాసి, లక్ష్మి తాటి, బండి, మద్వి, సుకీలేఖం, సోమ్ది కుంజం, చందు కుర్షం, మాసే, రీనా మార్కం, సోనీ మద్వి, సంగీత పద్దంగా గుర్తించామని చెప్పారు. కూడా ఉ న్నారని భావిస్తున్నారు.
వెల్ల మోడియం మావోయిస్టు పార్టీలో అత్యంత ప్రభావవంతమైన నేత. దక్షిణ బస్తర్‌లో టాప్ కమాండర్ కూడా. ఆయనపై భారీగా రివార్డు ఉంది. కాల్పుల్లో మృతిచెందిన వారిపై రూ.1.3 కోట్ల రివార్డు ఉందని తెలిపారు. హిడ్మా తరహాలోనే వ్యూహాత్మక దాడులకు ఆయన నేతృ త్వం వహించేవారు. ఒకానొక టైమ్‌లో హి డ్మా కంటే కూడా పెద్ద మావోయిస్టు నేతగా పోలీసులు, భద్రతా బలగాలు భావించేవి. మోడియం ఎన్‌కౌంట ర్ నిజమే అయితే.. నక్సలైటర్లకు పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
బీజాపూర్ సరిహ ద్దుల్లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన డీఆర్‌జీ జవా న్లు మోనువడా డి, దుకారు గోండె, రమేష్ సోడి మృతదేహాలను బీజాపూర్‌లోని పోలీసు లైన్‌కు గురు వారం తీసుకొచ్చారు.
అక్కడ వారికి పోలీ సు, జిల్లా ఉన్నతాధికారులు నివాళి అర్పించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎన్‌కౌంటర్ నుం చి ప్రాణాలతో బయటపడిన మావోయిస్టు లు త్వరగా లొంగిపోతే మంచిదని, లేకుంటే ప్రాణాలను పోగొట్టుకో వాల్సిన పరిస్థితి వస్తుందని పోలీసుఉన్నతాధికారులు హెచ్చరించారు. బస్తర్ పరిధిలో గడిచిన 19 నెల ల్లోనే వివిధ ఎన్‌కౌం టర్లలో 469 మంది నక్సలైట్లు మృతిచెందినట్లు ఐజీ తెలిపారు.