10 August, 2026 | 6:35 AM

హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

19-06-2024 05:14 PM

హైదరాబాద్ : నగరంలోని పలు హాస్టళ్లు,  వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో పుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లిలోని  హాస్టళ్లలో సోదాలు చేసి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ లేకుండా హాస్టల్స్ నడుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. పాడైపోయిన ఆహార పదార్థాలు, వస్తువులతో ఆహారం తయారు చేస్తున్నారని, వంటగదులు అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. కుళ్లిపోయిన ఉల్లిపాయలు, టమాటాలు వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు పలు హాస్టల్స్ కు నోటీసులు జారీ చేశారు.