08-10-2025 01:20:49 AM
-మళ్ల్లీ పెరిగిన బంగారం ధర
-పది గ్రాముల పసిడి రూ.1,23,850
ముంబై : బంగారం ధర పైపైకి దూసుకుపోతోంది. సోమవారం హైదరాబాద్ బులి యన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల నాణ్యమైన పది గ్రాముల బంగారం 1,23,460 ఉండ గా.. మంగళవారం మరో రూ.390 పెరిగి 1,23,850కి చేరుకుంది. కిలో వెండి ధర స్వల్పంగా రూ.150 పెరిగి 1,54,350కి చేరిం ది. అమెరికాలో షట్‌డౌన్ కొనసాగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డరేట్లను ఈ ఏడాది తగ్గిస్తుం దనే అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ నిధులను బంగారం, వెండిపైకి మళ్లించడమే ఇందుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.