calender_icon.png 8 October, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ రోగులకు పునర్జన్మ

08-10-2025 12:31:44 AM

  1. ఇద్దరికి మూల కణాలు దానం చేసి రెండో అవకాశాన్ని ఇచ్చిన సతీష్‌రెడ్డి
  2. సన్మానించిన డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా 
  3. ఫైర్‌సైడ్ చాట్‌ను ఏర్పాటు చేసిన సంస్థ

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): వైజాగ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్‌రెడ్డి, డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా ద్వారా తన మూల కణాలను రెండుసార్లు దానం చేసి ఒక అరుదైన ఘనతను సాధించారు. బ్లడ్ క్యాన్సర్‌తో పోరా డుతున్న ఇద్దరు రోగులకు జీవితంలో రెండ వ అవకాశాన్ని ఇచ్చారు. హైదరాబాదులో జరిగిన ఒక ప్రత్యేక వేడుకలో డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా వారు ఆయనను సన్మానించారు.

ఈ వేడుకలో, భారతదేశములో మూల కణాల దాతల కొరకు ఉన్న తక్షణ ఆవశ్యకత యొక్క ప్రాధాన్యతను తెలియజేయుటకు డికేఎంఎస్ ఫౌండేషన్ ఇండి యా ఒక ఫైర్‌సైడ్ చాట్ కూడా ఏర్పాటు చేసింది. సతీష్ మొదట జూలై 2016లో జరిగిన ఒక స్థానిక వేడుకలో సంభావ్య దాతగా నమోదు చేసుకున్నారు. అయిదు సంవత్సరాల తరువాత, జూన్ 2021లో ఆయన మూల కణాలు భారతదేశములోని ఒక బ్లడ్ క్యాన్సర్ రోగికి సరిపోతాయని నిర్ధారించబడటంతో, ఆయన తన మూల కణాలను దానం చేసి ఆ రోగి కోలుకోవటానికి సహాయపడ్డారు.

2023లో అహ్మదాబాదులో జరిగిన దాత-రోగి సమావేశంలో ఆయన తన స్వీకర్తను కలుసుకొని, ప్రాణాలను నిలబెట్టిన దానము ప్రభావాన్ని చూసి భావో ద్వేగానికి గురైన ఒక అనుభూతి. జనవరి 2025లో రెండవసారి తన మూల కణాల ను దానము చేశారు. సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మూల కణాలను దానం చేయడం అనేది గొప్ప ప్రభావం చూపే ఒక చిన్న చర్య. నేను వేరొక రోగికి మ్యాచ్ అవుతానని కాల్ అందుకున్నప్పుడు నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను.

నా తల్లిదండ్రుల సహకారముతో, నేను రెండవసారి కూడా దానం చేశాను” అన్నారు. బ్లడ్ క్యాన్సర్, తలస్సేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి వ్యాధు లపై పోరాటం చేయుటలో లాభాపేక్ష-లేని సంస్థ అయిన డికేఎంఎస్ ఫౌండేషన్ ఇండి యా బ్లడ్ క్యాన్సర్ నిపుణులు డా. ఎస్ కే. గుప్త, డికేఎంఎస్ ఇండియా ఎక్సిక్యూటివ్ చెయిర్మన్ పాట్రిక్ పాల్‌తో ఒక ఫైర్‌సైడ్ చాట్ ఏర్పాటు చేశారు. ఈ చర్చలలో భారతదేశములో మూల కణాల దాతల తక్షణ ఆవశ్యకతను, ప్రతి నమోదు బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగులకు జీవితములో రెండవ అవకాశాన్ని ఏ విధంగా ఇవ్వగలదు అనే అంశం ప్రాధాన్యీకరించబడింది.

డా. ఎస్‌కే. గుప్త, హెచ్‌ఓడి  క్లినికల్ హెమటాలజిస్ట్, హిమాటో-ఆంకాలజిస్ట్, బిఎంటి నిపు ణుడు, కాంటినెంటల్ హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఫైర్‌సైడ్ చాట్ ఏర్పాటు చేసి డికేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా సతీష్ రెడ్డితో కలుపుకొని ముగ్గురు రక్త మూలకణాల దాతలను సన్మానించింది. ఎవరైనా మూల కణాలను దానం చేసి ఇతరుల ప్రాణాలు నిలుపాలనుకుంటే www.dkms-india.org/register వద్ద దాతగా నమోదు చేసుకోవచ్చన్నారు.