సింధు శుభారంభం
సింగపూర్ ఓపెన్
సింగపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ సూపర్‌లో శుభారంభం చేసింది. బీడబల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో బుధవారం సింధు 21 22 లైన్ హొజ్‌మార్క్ (డెన్మార్క్)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇటీవలే మలేషియా మాస్టర్స్ టైటిల్ తృటిలో చేజార్చుకున్న సింధు ఈసారి మాత్రం టైటిల్ కొట్టాలనే సంకల్పంతో బరిలోకి దిగింది. దీనిలో భాగంగా తొలి అడుగును దిగ్విజయంగా పూర్తి చేసింది. తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వని సింధు కేవలం రెండు గేముల్లోనే మ్యాచ్‌ను ముగించింది.
అయితే ప్రిక్వార్టర్స్‌లో సింధూ స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌తో తలపడనుంది. ఇరువురి మధ్య జరిగిన పోరాటాల్లో మారిన్ 11 ముందంజలో ఉంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రణయ్ 21 18 21 కర్రాగి (బెల్జియం)ని మట్టికరిపించాడు. కాగా.. భారత టాప్ షట్లర్లు లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్‌లు తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్ త్రిసా జోడీ రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో ఈ జోడీ 21 21 చెంగ్ యూ సింగ్ జంటను చిత్తు చేసింది. పురుషుల డబుల్స్‌లో ప్రసాద్ సాయి ప్రతీక్, మహిళల డబుల్స్‌లో అశ్విని , సింగి జోడీలు ఓటమి పాలయ్యారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమిత్ కరుణాకరన్ వరియత్ ఆధ్య, దీవాంగన్ జంటలు కూడా పరాజయం చవిచూశాయి.






