5 August, 2026 | 1:54 AM

తొమ్మిదో సీడ్‌గా పీవీ సింధు

05-08-2026 12:00 AM
  1. సాత్విక్, చిరాగ్ జోడీకి ఐదో సీడింగ్
  2. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్
  3.    17 నుంచి ఢిల్లీ వేదికగా టోర్నీ

న్యూఢిల్లీ, ఆగస్టు 4 : ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ సీడింగ్స్ విడుదల చేశారు. తెలుగుతేజం పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో 9వ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. ఇటీవలే జపాన్ ఓపెన్ గెలిచి ఫామ్ అందుకున్న సింధుపై అంచనాలున్నా యి. భారత్ తరపున ఐదు విభాగాల్లో రెం డేసి ఎంట్రీ నమోదవగా, నాలుగు విభాగాల్లో కనీసం ఒక్కో సీడెడ్ ప్లేయర్ చోటు దక్కించుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 14వ సీడ్‌గా ఆడనున్నాడు.

పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి 5వ సీడింగ్ దక్కించుకుంది. అటు మిక్స్‌డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల, తనీశా జోడీ 15వ సీడ్‌గా ఎంపికయ్యారు. పురుషుల సింగిల్స్‌లో చైనా ప్లేయ ర్ షీ యుకీ, మహిళల సింగిల్స్‌లో దక్షిణ కొరియా స్టార్ అన్ సే యంగ్ టాప్ సీడ్‌లుగా బరిలోకి దిగుతున్నారు.

మహిళల వి భాగంలో జపాన్ ప్లేయర్ యమగుచి రెండో సీడ్‌గానూ, చైనా షట్లర్లు వాంగ్ జీ యూ మూడో సీడ్‌గానూ, చెన్ యుఫెయ్ నాలుగో సీడ్‌గానూ ఎంపికయ్యారు. పురుషుల డబుల్స్‌లో దక్షిణ కొరియా జోడీ కిమ్ వోన్ హో, సియో సెయుంగ్ జై టాప్ సీడింగ్ దక్కించుకుంది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియ న్‌షిప్ ఆగస్టు 17 నుంచి 23 వరకూ న్యూఢిల్లీలో జరుగుతుంది.