1 August, 2026 | 12:10 AM

రుద్రంపూర్ లో కొండచిలువ కలకలం

24-08-2024 05:30 PM

భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 24 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ పరిధిలోని రుద్రంపూర్ లో భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే రుద్రంపూర్ లోని ఎస్బిఐ ఎటిఎం వద్ద శుక్రవారం రాత్రి కొండచిలువ ప్రత్యక్షమైంది. విషయం తెలుసుకొని అదే గ్రామానికి చెందిన గూడెల్లి యాకయ్య, మురళీధర్, వెంకటేష్ అనే వారు పట్టుకొని సమీపంలోనే ఐదో సాఫ్ట్ అటవీ ప్రాంతంలో వదిలివేయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.