1 August, 2026 | 1:06 AM

సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా రిజిస్టర్

24-08-2024 05:21 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆదిలాబాద్ జిల్లా రిజిస్టర్ సిహెచ్ అశోక్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజువారీగా ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వసతుల కల్పన ఎలా ఉంది, తదితర అంశాలను పరిశీలించారు. జిల్లా ఇన్చార్జ్ సబ్ రిజిస్టర్ కే శ్రీనివాస్ రెడ్డిని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ ల కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు.