4 April, 2026 | 10:04 PM

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య

04-04-2026 08:08 PM

రాజాపూర్: ప్రభుత్వం పరులలోని విద్యార్థులకు హెచ్ఎం సయ్యద్ ఇబ్రహీం అన్నారు. శనివారం మండలంలోని మల్లేపల్లి, ఈద్గాన్ పల్లి గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. తమ పిల్లలకు నిష్ణాతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందిస్తామని తెలిపారు. అనంతరం సోమ్లా తాండ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ తోటలను పరిశీలించారు. తోటలలో వివిధ రకాల కూరగాయల సాగులు చూసి విద్యార్థులను ఎంతగానో అభినందించారు.